డి.ఎస్సి ద్వార నియామకం చేయనున్న ఉపాధ్యాయులు పోస్టులు ముందుగా కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో భర్తీ చెయ్యాలి-డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ డిమాండ్.




డి.ఎస్సి ద్వార నియామకం చేయనున్న ఉపాధ్యాయులు పోస్టులు  ముందుగా కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో భర్తీ చెయ్యాలి.

నాలుగు రోజుల్లో పరిష్కారం చేస్తా అన్న అధికారులు జాడ ఎక్కడ

■ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ డిమాండ్

 ఏలూరు ఆగస్టు 25: డి.ఎస్సి ద్వార నియామకం చేయనున్న ఉపాధ్యాయులు పోస్టులు  ముందుగా కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో భర్తీ చెయ్యాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్ ప్రభుత్వాని డిమాండ్ చేశారు. సోమవారం నాడు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు పోస్టులు నియామకం గురించి పిజిఆర్ఎస్ లో కలెక్టర్ వెట్రి సెల్వికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ జూన్,జూలై లో నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ సందర్భంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో టీచర్స్ కొరత ఏర్పడటంతో విద్యార్థిని, విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగింది అని  కుక్కునూరు మండలంలో మొత్తం 46 పాఠశాలలు ఉన్నాయి. మండలానికి కేటాయించిన పోస్టులు 141 కానీ ప్రస్తుతం మండలంలో ఉన్న ఉపాధ్యాయుల 46 మంది ఉన్నారు. ఇంకా 95 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వేలేరుపాడు మండలంలో మొత్తం 43 పాఠశాలలు ఉన్నాయి. మండలానికి కేటాయించిన పోస్టులు 95 కానీ ప్రస్తుతం మండలంలో ఉన్న ఉపాధ్యాయుల 43 మంది ఉన్నారు. ఇంకా 44 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క స్కూల్ లో సుమారు 100 నుండి 125 మంది విద్యార్థిని, విద్యార్ధులున్నారు. ఈ పాఠశాలలో ఉన్న టీచర్ కేవలం ఆ పిల్లలను సర్ధిచూసుకోవడానికే సమయం సరిపోతుంది తప్ప పాఠ్యాంశాలు  చెప్పడానికి తగిన సమయం సరిపోక ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారని  తద్వారా షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజన విద్యార్ధిని, విద్యార్థులకు విద్య అందించడంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గిరిజన పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ సందర్భంగా ఈ పరిస్థితిని అధికారులు ముందుగా అంచనా వేయకపోవడం బాధాకరం. కుక్కునూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంఈఓ బాబూరావు గారు ఇంత జరుగుతున్న మండలంలో ఉన్న స్కూల్స్ ను సందర్శించడం కానీ, సమస్యకు పరిస్కరం చూపకపోవడం లో విఫలం అవుతున్నారని  కుక్కునూరు మండలంలో ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చెయ్యాలని జూలై 16,17వ తేదీల్లో రెండు రోజులు పాటు అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆ దీక్షలకు జిల్లా విద్యాధికారి ఏ.ఎమ్.ఓ శ్రీను ని దీక్ష శిబిరానికి పంపించి ఫోన్లో మాట్లాడుతూ నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ నేటికీ భర్తీ జరగలేదు. నాలుగు రోజుల్లో టీచర్లు పోస్టులు భర్తీ చేస్తా అని నేటికి పరిష్కారం చెయ్యలేదు. ఇప్పటికే విద్య సంవత్సరం ప్రారంభం అయ్యి మూడు నెలలు కావొస్తుంది. కావున తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి డి.ఎస్సి ద్వారా ఏజెన్సీ ప్రాంతాలలో   ఉపాధ్యాయులు పోస్టులు భర్తీ చేయాలని సూర్యకిరణ్ డిమాండ్ చేశారు.

Post a Comment

Previous Post Next Post