స్వర్ణాంధ్రలో క్లౌడ్ ఫౌండేషన్, ఏఐపై వర్క్ షాపు.
నరసాపురం, క్రైమ్ 9 మీడియా ప్రతినిధి
సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఏఐ అండ్ ఎంఎల్ విభాగం, ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం క్లౌడ్ ఫౌండేషన్, ఏజెంటిక్ ఏఐపై కొలిగట్ల ఫణి రవీంద్ర ఒకరోజు వర్క్ షాపు నిర్వహించారు. ఏఐపై భవిష్యత్ కార్యక్రమాలు మరియు క్లౌడ్ కు సంబంధించిన విషయాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు. గతంలో స్వర్ణాంధ్ర కళాశాలలో విద్యనభ్యసించిన ఫణి రవీంద్ర ప్రస్తుతం లండన్, యు.కె. లోని మాస్టర్ కార్డులో ఏఐ అండ్ డేటా స్ట్రాటజీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.వి. సత్యనారాయణ (కేఎస్), ట్రెజరర్ కే. వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సురేష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఏ గోపీచంద్ ఏఐ, ఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ బొమ్మ రామకృష్ణ, ఈసిఈ విభాగాధి పతి డాక్టర్ బి సుబ్రహ్మనేశ్వరావు, ఆధ్యాపక సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
