వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్ )లో నందమూరి బాలకృష్ణ..
శుభాకాంక్షలు తెలిపిన ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు.
ఏలూరు, ఆగస్టు 25:- వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్ లో నందమూరి బాలకృష్ణ గారి పేరు నమోదు చేయడం చాలా సంతోషంగా ఉందని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు అన్నారు. 50 సంవత్సరాలు హీరోగా గుర్తింపు పొందిన నందమూరి బాలకృష్ణ గారి అపూర్వమైన సినిమా జైత్రయాత్ర కి, ఇది అత్యంత గౌరవప్రదమైన ఘనతగా నిలుస్తుందన్నారు. తన కెరీర్ అంతట బాలకృష్ణ గారు తన తండ్రి లెజెండరీ స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి శాశ్వత వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, నందమూరి వారసుడిగా అడుగు పెట్టి జానపదాలు, కుటుంబ కథా చిత్రాలు, యాక్షన్ చిత్రాలతో మెప్పిస్తూ, టాలీవుడ్ లో తన ఆల్ రౌండర్ ప్రతిభతో, శక్తివంతమైన స్క్రీన్ ప్రజెంట్, మరియు తనకున్న కళపట్ల అవిరామమైన నిబద్ధతతో తనదైన గుర్తింపును సాధించుకున్నారని తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ బాలకృష్ణ గారి ప్రయాణం ఉత్సాహం, క్రమశిక్షణ మరియు శాశ్వత కళాత్మకకు సాక్ష్యం. ఇది అన్ని తరాల సినిమా ప్రేక్షకులను, వారికి అభిమాన పాత్రులను చేసిందన్నారు. గత 15 సంవత్సరాలుగా బసవతారకం, ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా, ఆయన పబ్లిక్ సర్వీస్ ను ఒక ఉదాత్త మిషన్ గా నిరూపించారని అన్నారు. జీవితాలను మార్చడం, ఆశను అందించడం, మరియు అత్యంత అవసరమైన వారికి కరుణామయ ఆరోగ్య సేవలు చేరువ చేయడం, కళాత్మక ప్రతిభ మరియు మానవతావాద లీడర్షిప్ యొక్క ఈ అరుదైన కలయిక. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గర్వంగా నిలబడే స్థిరత్వం, బాలకృష్ణ గారిలోని అంకితభావం మరియు సామాజిక ఉధ్ధరణ ఆయన గొప్పతనాన్ని నిరూపిస్తుందని ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఆయన మరిన్ని సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ, ప్రజాసేవలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

.jpeg)
