పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవతో సత్య సాయి మంచినీటి పథకం కార్మికులకు ఉపశమనం.


పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు  చొరవతో సత్య సాయి మంచినీటి పథకం కార్మికులకు ఉపశమనం.

బర్రింకలపాడు/పోలవరం:
పోలవరం నియోజకవర్గంలో పని చేస్తున్న సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల సమస్యలపై ఇటీవలే జరిగిన డిఆర్సి సమావేశంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు  గళం విప్పారు. కార్మికులు ఎదుర్కొంటున్న జీతాల బకాయిల సమస్యను మంత్రుల సమక్షంలో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ (RWS) ఉన్నతాధికారులు స్పందించి, వచ్చే వారం రోజుల్లో దశలవారీగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ –
 "సత్యసాయి బాబా మంచినీటి పథకం కార్మికులు మన ప్రజలకు ప్రాణాధారమైన నీటిని సరఫరా చేస్తూ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అలాంటి కార్మికులు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నేను కట్టుబడి ఉంటాను" అన్నారు.
స్థానిక ప్రజలు, సత్యసాయి మంచినీటి పథకం కార్మికులు ఎమ్మెల్యే  చొరవను అభినందిస్తూ, "మా సమస్యలను మనవిగా తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసిన ఎమ్మెల్యే పనితీరు అభినందనీయమైనది" అని హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

Previous Post Next Post