రాష్ట్ర ఉత్తమ గురుబ్రహ్మ పురస్కార్ అందుకున్న టీచర్ వెంకటేశ్వర్లు.
( ప్రకాశం జిల్లా క్రైమ్, 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని బాలికల పాఠశాలలో పనిచేస్తున్న సవారి వెంకటేశ్వర్లుకు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటంతో పాటు రాష్ట్ర ఉత్తమ గురుబ్రహ్మ పురస్కార్ ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా ఉపాధ్యాయుడు
బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ఎంఈఓ ప్రధానోపాధ్యాయులు పోలా నాగభూషణరెడ్డి చేతుల మీదుగా బాలికల ఉన్నత పాఠశాల నందు అందించారు. గత 32 సంవత్సరాలుగా నిరంతరం ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందించినందుకు ఆయనకి రాష్ట్ర ఉత్తమ గురుబ్రహ్మ పురస్కార్ ను అందించామని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గిద్దలూరు ప్రాంతంలో ఆంగ్లేయుల మీద యుద్ధం చేసి హోరాహోరీగా పోరాడినటువంటి సంఘటనలు మాటలకు అందనివి చాలా చాలా ఉన్నాయి .
తెల్లోల్ల మీదికి విరుచుపడి వారిని తరిమి తరిమి కొట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి ఆ యుద్ధంలో చాలామంది ఆంగ్లేయులు, నరసింహారెడ్డి సైన్యం చాలామంది చనిపోయారు. అటువంటి ప్రథమ స్వాతంత్ర్య సమరయోధులు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీద రాష్ట్ర ఉత్తమ గురుబ్రహ్మ పురస్కార్ ను గిద్దలూరు తాలూకాలోని ఆరు మండలాల లోని ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ లకు 72 మందికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాజీ రాష్ట్రపతి వర్యులు జయంతి సందర్భంగా రాష్ట్ర ఉత్తమ గురుబ్రహ్మ పురస్కార్ ను ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు అందిస్తున్నామని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు. అవార్డు గ్రహీత సవారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రథమ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫోటోతో నాకు రాష్ట్ర ఉత్తమ గురుబ్రహ్మ పురస్కార్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి పేరుమీద పురస్కార్ అందించిన బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకుని కి నా తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లంకపల్లి సగీర్, వేణుగోపాల్ రెడ్డి, షేక్ సుభాని, షేక్ నూర్ భాష పాల్గొన్నారు.
