కాణిపాకం వరసిద్ధి వినాయకునికి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పణ.
బ్రహ్మోత్సవాలు సందర్బంగా కాణిపాకం వరసిద్ధి వినాయకునికివిజయవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు సమర్పణ చేశారు.
ఈరోజు ఉదయం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి వికె శీనా నాయక్, ప్రధాన అర్చకులు ఎలా. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో వినాయకునికి వస్త్రాలు సమర్పించారు.
కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ విజయవాడ నుండి వచ్చిన బృందాన్ని మేళతాళాలతో స్వాగతించారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి. రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సి హెచ్ రంగారావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కే. గంగాధర్, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ శర్మ, దేవస్థానం అర్చకులు ఆర్. శ్రీనివాస్ శాస్త్రి, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
