రాచర్ల మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ.



రాచర్ల మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ.

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని గుండ్లకమ్మవాగు శనివారం ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వస్తున్న భక్తుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు. ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్ల సహాయంతో భక్తులను పోలీసులు గుండ్లకమ్మ వాగును దాటించారు. శనివారం కావడంతో దాదాపు 4,000 మంది భక్తులు ఆలయ దర్శనానికి వచ్చారు. గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో అప్రమత్తమైన అధికారులు భక్తులకు ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post