మంగళగిరి 32వ వార్డులో నిర్వహించిన "బాబు షూరిటీ- మోసం గ్యారెంటీ" కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి.
చంద్రబాబు మాటలకు ఎవరైనా మోసపోవాల్సిందే.
జగన్మోహన్ రెడ్డి పథకాలను కాపీ కొట్టి మరో ఆరు పథకాలు ఎక్కువ ఇస్తానని చెప్పడంతో ప్రజలు మోసపోయారు.
సూపర్ సిక్స్ పథకంలో సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు.
ఫ్రీ బస్సులో సీట్లు లేక మహిళలు గొడవలు పడుతున్నారు.
నెలకు 1500 రూపాయలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు.
పథకాల పేరుతో మోసం చేసింది కాక పేదప్రజలను దత్తతు తీసుకోవాలని ఉద్యోగస్తులను ఇబ్బంది పెడుతున్నారు.
పెన్షన్లు పెంచుతానని చెప్పి ఒకరి పెన్షన్ మరొకరికి ఇచ్చి మిగిలిన వారికి పెన్షన్లు ఆపివేశారు..
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో 40 వేల స్కూలుకి 12,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు.
అమ్మ ఒడి పథకం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇస్తానని 13000 వేశారని మిగిలిన ₹2,000 రూపాయలు ఇవ్వకుండా జగన్ మోసం చేశాడని అబద్ధపు ప్రచారాలు చేశారు.
స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ అబద్దాలు చెప్పేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి.
ఈరోజు మీరు తల్లికి వందనం పేరుతో 13000 వేశారు మిగిలిన 2000 మీకు ప్రభుత్వ ఖజానాలో దాచుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్న పథకాల వల్లనే రాష్ట్రంలో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందింది.
వాలంటరీ వ్యవస్థతో కరోనా లాంటి మహమ్మారిని తరిమికొట్టాడు జగన్మోహన్ రెడ్డి...
కరోనా సమయంలో చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో సగం జనాభా చనిపోయి ఉండేవారు.
రెండు ఎకరాల భూము నుండి నుండి లక్ష కోట్లు ఎలా సంపాదించావు చంద్రబాబు..?
పేదవారి గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు కాదు.
బడుగు ,బలహీన ,పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే.
ఆ తర్వాత అంతలా ప్రజల గురించి ఆలోచించి పథకాల అమలు చేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
మరో మూడు సంవత్సరాలు ఓపిక పడితే మన ప్రభుత్వం వస్తుంది.
అధికారం కోసం ప్రజలను మోసం చేసే పార్టీ కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ.
ప్రజల కోసం మాత్రమే నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
