కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు తరలిన యువజన, విద్యార్థి నేతలు ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్.






కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు తరలిన యువజన, విద్యార్థి నేతలు

ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్.


 TELANGANA హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన అమరజీవి సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటు మాజీ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) ఉప్పల్ నియోజకవర్గ సమితి నేతలు సుమారు120 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పీడిత ప్రజల కోసం అవిరాళంగా కృషి చేసిన వ్యక్తి కామ్రేడ్ సురవరం అని అన్నారు.సురవరం మరణం వామపక్ష, సామాజిక ఉద్యమాలకు తీరని లోటు అని వారు అన్నారు.

ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నేత మహేష్ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పనిచేసిన ఆనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తరువాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఎదిగారన్నారు.సురవరం సుధాకరరెడ్డి చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్‌ గా కీర్తి గడించారన్నారు. 2008 నుండి సిపిఐ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన తదుపరి 2012లో పాట్నాలో పార్టీ 21వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. పుదుచ్చేరి (2015), కొల్లాం(2018) మహాసభలో తిరిగి ఎన్నుకోబడిన సుధాకరరెడ్డి 2019 జులై 24న పార్టీ జాతీయ సమితి సమావేశంలో ఆరోగ్య కారణాలతో రిలీవ్‌ అయ్యారన్నారు. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ తరపున తెలియజేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో నేతలు ఎల్లయ్య, శ్రీనివాస్,ప్రవీణ్, కిరణ్, నదీమ్, విశాల్, రాము, భరత్, కీర్తన్, ప్రదీప్, హరి, రమ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post