వినాయక నిమజ్జనం రోజు ఎవరైనా ఘర్షణకు దిగితే కఠిన చర్యలు తప్పవు.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి. దాసరి యోబు)
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టిన ఏరియాలలో ఏ విగ్రహం దగ్గర ఘర్షణలు జరుగుతాయో ఆ విగ్రహ కమిటీ వారు బాధ్యత వహించాలని సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలియజేశారు.
అలాగే వివిధ గ్రామాలలో ఉన్నటువంటి చెరువుల దగ్గరికి నిమజ్జనానికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెరువుల దగ్గర వాగుల దగ్గర బ్రిడ్జి ల దగ్గర గంటల తరబడి ఉండవద్దని ఆయన కోరారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఊరేగింపు ఉత్సవాలలో విద్యుత్ తీగలను గమనించాలని విగ్రహాలకు తగలకుండా పొడవైనకర్రల సహాయం తీసుకోవాలని. గణేష్ ఉత్సవాలు కుల మతాలకు అతీతముగా సంతోషకరమైన వాతావరణం లో జరుపుకోవాలని మండల ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుదర్శన్ తెలియజేశారు.
