నంద్యాల జిల్లా.
నంద్యాల 1వ వార్డు హరిజన పేటలో గణేషుని 3వ రోజును పురస్కరించుకుని మాజీ కౌన్సిలర్ కన్నమ్మ ఆథ్వర్యంలో బ్లడ్ అచ్చు అద్యక్షతన ఘణంగా రక్తదాన కార్యక్రమం.
పట్టణంలోని స్థానిక 1వ వార్డు హరిజన పేటలో గణేషుని 3వ రోజును పురస్కరించుకుని మాజీ కౌన్సిలర్ కన్నమ్మ ఆథ్వర్యంలో బ్లడ్ అచ్చు అద్యక్షతన ఘణంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం.హెచ్ .హుస్సేన్ ని ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రక్తదానాన్ని ఇచ్చేందుకు ఎక్కువ సంఖ్యలో స్వతంత్రంగా యువకులు పాల్గొని రక్తదానాన్ని ఇచ్చారు.ఈ సందర్భంగా బ్లడ్ అచ్చు మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్ కన్నమ్మ వినాయక చవితిని పురస్కరించుకొని భక్తి తో పాటు ఇలాంటి రక్తదానా సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి పరిణామన్నారు.రానున్న కాలంలో మాజీ కౌన్సిలర్ కన్నమ్మ ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారికి తన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడు సిథ్థంగా ఉంటామని బ్లఢ్ అచ్చు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కన్నమ్మ మాట్లాడుతూ వినాయక చవితిని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి గర్భిణిలకు,చిన్న పిల్లలకు ఆపత్కాల సమయాల్లో ఇబ్బంది లేకుండా ఉండాలని రక్తహీనతను పారద్రోలాలని ముఖ్య ఉద్దేశ్యముతో ఈ శిబిరం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు,వార్డు సభ్యులకు,ముఖ్యంగా రక్తదాన కార్యక్రమాని పిలవగానే ఇక్కడికి వచ్చి రక్తదానం చేసిన యువతకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ విషయం గురించి బ్లడ్ అచ్చు కు తెలిపగానే వెంటనే స్పందించి తమకు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు బ్లడ్ అచ్చుకు కృతజ్ఞతలు, తెలియజేశారు.
ఈసందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న M..హుస్సేన్ తమ్ముడు, మొహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమంకు తమను పిలిచి ఈ సదవకాశాన్ని కల్పించిన మాజీ కౌన్సిలర్ కన్నమ్మ కు కృతజ్ఞతలు, దన్యవాదాలు తెలిపారు.ఈ విదంగా కుల,మతాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలలో భాగం కావడం చాలా సంతోషకరమని,ఇది చాలా మంచి పరిణామం అని మాజీ కౌన్సిలర్ కన్నమ్మకు తమవంతు సహాయ, సహకారాలు అందించేందుకు
తాము ఎల్లప్పుడు సిథ్థంగా ఉంటామని అన్నారు.
మెగా ఫ్యామిలి సీనియర్ అభిమాని సురేష్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన మాజీ కౌన్సిలర్ కన్నమ్మ కు కృతజ్ఞతలు తెలిపారు.కన్నమ్మ గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు.
ఇంతకు ముందు కూడా గతంలో 1వ వార్డు లో తాగేందుకు నీరు లేకుంటే వాటర్ ట్యాంక్ లను తెప్పించి రాజకీయలకు అతీతంగా ప్రతి ఇంటికీ త్రాగు నీరు అందించారని, మాజీ ఎమ్మెల్యే శిల్పా కుటుంబంతో మంచి సత్సంభాలతో ఇప్పటికి,ఎప్పటికీ నిలిచిపోతారని వారికి దేవుని ఆశీస్సులతో పాటు వార్డు ప్రజలందరి అభిమానాలు ఎప్పటికీ ఉంటాయని భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మహానంది, నాగరాజు, సుబ్బారాయుడు,మల్లి,ఆది, సురేష్,రాజు,కిరణ్,శివ, మల్లికార్జున,మథు,భరత్,వంశీ,శివ శంకర్,ప్రశాంత్,జమ్మి సూరయ్య,రుద్ర నగేష్,గణా,నారి తో పాటు పలువురు ఈకార్యక్రమంలో పాల్గొని రక్తదానాన్ని ఇచ్చారు.
.jpeg)

