కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు.




 కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటు.

సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సురవరంకు నివాళులు.

               విఎస్. బోస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటేరియన్‌ సురవరం సుధాకరరెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ అన్నారు.సీపీఐ ఉప్పల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని సీపీఐ కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ వద్ద సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

         ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్. మాట్లాడుతూ సురవరం ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు.  సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ముగిసిన కొద్ది నిమిషాలకే తమ ఆత్మీయ నేత సురవరం మరణించిన వార్త తెలియడంతో సిపిఐ నాయకులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి 1942, మార్చి 25న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కాన్‌రేవ్‌పల్లిలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట్‌రామ్‌రెడ్డి. తెలంగాణ వైతాళికుడు, గోల్కోండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి స్వయాన సుధాకర్‌రెడ్డికి పెదనాన్న అవుతారన్నారు.ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐవైఎఫ్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా, అనంతరం కాలంలో ఎస్‌ఎఫ్‌, వైఎఫ్‌ జాతీయ అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలో ఉంటూ దేశవ్యాప్త విద్యార్థి, యువజన ఉద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన నేతృత్వంలో పనిచేసిన ఆనేక మంది విద్యార్థి, యువజన నాయకులు తరువాత కాలంలో వివిధ రాష్ట్రాల్లో రాజకీయ నాయకులుగా ఎదిగారన్నారు.సురవరం సుధాకరరెడ్డి చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త. ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ. గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్‌ గా కీర్తి గడించారన్నారు. 2008 నుండి సిపిఐ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా పనిచేసిన తదుపరి 2012లో పాట్నాలో పార్టీ 21వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. పుదుచ్చేరి (2015), కొల్లాం(2018) మహాసభలో తిరిగి ఎన్నుకోబడిన సుధాకరరెడ్డి 2019 జులై 24న పార్టీ జాతీయ సమితి సమావేశంలో ఆరోగ్య కారణాలతో రిలీవ్‌ అయ్యారన్నారు. సురవరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సీపీఐ పార్టీ తరపున తెలియజేస్తున్నామన్నారు.

ఈ నివాళి కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ.దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్, సీపీఐ నియోజకవర్గ సభ్యులు జీ. లక్ష్మీ నారాయణ, మిరియాల సాయిలు, శ్రీనివాస్, స్వామిదాస్, రాజు, బంగారయ్య, యాకూబ్, ఐలయ్య, పాపయ్య, నాగేష్, దాసు, రామారావు,నదీమ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
[7:51 pm, 23/08/2025] D Yobu Garu: 60 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి దంపతులు..

 పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పి4 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు  శ్రీ జీవి ఆంజనేయులు దంపతులు 60 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామాన్ని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, సతీమణి లీలావతి దంపతులు సందర్శించి గ్రామస్తులతో సమావేశమై 60 నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో నియోజకవర్గం నుండి  100 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం జరుగుతుందన్నారు. పేదరిక నిర్మూలన కోసం తమ కుటుంబ సభ్యులందరూ మార్గదర్శకులుగా ఉంటారని తెలిపారు. సంపన్నులందరు ముందుకొచ్చి  పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post