ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళను రక్షించిన కంభం పోలీసులు.
కంభం: ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి వెళ్లిన మహిళను స్థానిక పోలీసులు చాకచక్యంగా రక్షించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన పోలీసులు మహిళను అడ్డుకుని, సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం ఇరువర్గాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
