కూటమి ప్రభుత్వం వచ్చి సంక్షేమ అభివృధి కి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని ఎమ్మెల్యే బడేటి చంటి విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే రాదా కృష్ణయ్య చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఓసి ద్వారా ఐదుగురికి 20 లక్షల 50 వేల రూపాయలు చెక్కులను అందచేసామని ,మొత్తం 34 మందికి 46 లక్షల 38వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఈరోజు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ శివప్రసాద్, నగర టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, పలు డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.


.jpeg)
