ఒంగోలు జి జి హెచ్ లో అత్యాధునిక లేజర్ విధానంతో కిడ్నీ రాళ్లకు విజయవంతమైన చికిత్స అందించిన వైద్యులు.


 ఒంగోలు జి జి హెచ్ లో అత్యాధునిక లేజర్ విధానంతో కిడ్నీ రాళ్లకు విజయవంతమైన చికిత్స అందించిన వైద్యులు. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

యూరాలజీ వైద్య బృందాన్ని అభినందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఏస్. మాణిక్యరావు

 ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగంలో అత్యాధునిక లేజర్ హోల్మియం లేజర్ (Holmium Laser) సాంకేతికతతో కిడ్నీ రాళ్లకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఏస్. మాణిక్యరావు తెలిపారు. ఆసుపత్రికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక లేజర్ యంత్రాలు, అవసరమైన పరికరాల సహాయంతో కిడ్నీ రాళ్లకు కోత లేకుండా, తక్కువ రక్తస్రావంతో, అత్యంత సురక్షితంగా లేజర్ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా యూరాలజిస్ట్ డా. కిరణ్ కుమార్ నాయకత్వంలోని వైద్య బృందం

 Dr.మాలకొండారెడ్డి .k( అసిస్టెంట్ ప్రొఫెసర్ ) Dr.రసూల్ .ఎండీ (అసిస్టెంట్ ప్రొఫెసర్ ) Dr.జయసుందరం ,ప్రొఫెసర్ anaesthesi లు అందించిన సేవలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఏస్. మాణిక్యరావు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఉండటం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ఈ లేజర్‌ను కేవలం కిడ్నీ రాళ్లకే కాకుండా, మూత్రనాళ రాళ్లు, మూత్రాశయ రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలు, అలాగే కొన్ని మృదుకణజాల (Soft Tissue) శస్త్రచికిత్సలలో కూడా ఉపయోగించ వచ్చు అన్నారు. 

ఇటీవల దిబ్బయ్య అనే రోగి కిడ్నీలో రాళ్ల సమస్యతో జీజీహెచ్‌ను ఆశ్రయించారని, వీరిని పరీక్షించిన , యూరాలజీ నిపుణులు డా,,జి కిరణ్ కుమార్ బృందం పూర్తి స్థాయి లో పరీక్షించి కిడ్నీ లో రాళ్లను గుర్తించారు. దిబ్బయ్యకు శస్త్ర చికిత్స అవసరం అని భావించి జి జి హెచ్ లో అందుబాటు లో వున్నా అత్యాధునిక లేజర్ విధానంలో విజయవంతంగా చికిత్స అందించామన్నారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ అత్యాధునిక లేజర్ కిడ్నీ స్టోన్ శస్త్రచికిత్సను జీజీహెచ్ ఒంగోలులో ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన రోగులకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. కిడ్నీ రాళ్ల సమస్యతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్బంగా డెప్యూటీ సూపరెంటెండెంట్ డా నామినేని కిరణ్ మాట్లాడుతూ అధునాతన వైద్య పరికరాలు, వైద్యుల 

అంకితభావం తో సూపర్ స్పెషలిటీ సేవలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయన్నారు. 

ఈ సమావేశం లో సి ఎస్ ఆర్ ఎమ్ ఓ డా,, మాధవి లత , డా ప్రభాకరావు, ఏ ఎం ఆర్ ఓ డా,,సునీల్ గవాస్కర్. తదితరులు వున్నారు. 

హోల్మియం లేజర్‌తో కిడ్నీ రాళ్ల చికిత్స – సులభమైన తెలుగు వివరణ

హోల్మియం లేజర్ (Holmium Laser) వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు:

అత్యంత ఖచ్చితమైన చికిత్స – సురక్షితం

ఈ లేజర్ రాళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న కిడ్నీ కణజాలానికి చాలా తక్కువ నష్టం కలుగుతుంది. అందువల్ల ఇది అత్యంత సురక్షితమైన చికిత్స.

 ఒకే యంత్రంతో అనేక రకాల చికిత్సలు

ఈ లేజర్‌ను కేవలం కిడ్నీ రాళ్లకే కాకుండా, మూత్రనాళ రాళ్లు, మూత్రాశయ రాళ్లు, ప్రోస్టేట్ సమస్యలు, అలాగే కొన్ని మృదుకణజాల (Soft Tissue) శస్త్రచికిత్సలలో కూడా ఉపయోగించవచ్చు.

తక్కువ నొప్పి – తక్కువ రక్తస్రావం

లేజర్ కిరణం చాలా ఖచ్చితంగా పనిచేయడం వల్ల చుట్టూ ఉన్న కణజాలానికి వేడి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల రక్తస్రావం, నొప్పి కూడా తగ్గుతాయి.

త్వరగా కోలుకునే అవకాశం

ఈ చికిత్సలో పెద్ద కోతలు అవసరం ఉండవు. శస్త్రచికిత్స తర్వాత రోగి త్వరగా కోలుకుని తక్కువ రోజుల్లోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుంది.

వైద్యులకు సులభంగా ఉపయోగించగల ఆధునిక సాంకేతికత

ఈ యంత్రంలో అవసరానికి అనుగుణంగా లేజర్ శక్తిని మార్చుకునే సౌకర్యం ఉంటుంది. దీంతో వైద్యులు మరింత సమర్థవంతంగా, సురక్షితంగా చికిత్స అందించగలరు.

మొత్తంగా

హోల్మియం లేజర్ చికిత్స అనేది ఆధునిక, సురక్షితమైన, కోతలు లేకుండా (మినిమల్లి ఇన్వేసివ్), తక్కువ నొప్పితో, త్వరగా కోలుకునే అత్యుత్తమ పద్ధతి. కిడ్నీ రాళ్లు, మూత్రనాళ రాళ్లు, ప్రోస్టేట్ వంటి యూరాలజీ సమస్యలకు ఇది ప్రస్తుతం అత్యంత ప్రభావవంతమైన చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post