కాశీబుగ్గలో డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ – రిజిస్ట్రేషన్లు నిలిచివేత.



 కాశీబుగ్గలో డాక్యుమెంట్ రైటర్ల పెన్‌డౌన్ – రిజిస్ట్రేషన్లు నిలిచివేత.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

కాశీబుగ్గ, జూలై 7: 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.396తో పాటు పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్‌షిప్) విధానాన్ని వ్యతిరేకిస్తూ కాశీబుగ్గలో డాక్యుమెంట్ రైటర్లు రెండు రోజుల పెన్‌డౌన్ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ ఉపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆరోపిస్తూ వారు నిరసన వ్యక్తం చేశారు.

పెన్‌డౌన్ ఆందోళన ప్రభావంతో కాశీబుగ్గ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క స్లాట్ బుకింగ్ కూడా నమోదు కాకపోవడంతో కార్యాలయం వెలవెలబోయింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొని నిరాశతో వెనుదిరిగారు.

ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్లు మాట్లాడుతూ, జీఓ నెం.396 మరియు పీపీపీ విధానం అమలైతే వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాలను ఉపసంహరించుకుని, తమ సమస్యలపై చర్చలు జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని డాక్యుమెంట్ రైటర్ల సంఘం హెచ్చరించింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post