సోంపేట రైల్వే యార్డు వద్ద అపరిచిత వ్యక్తి మృతి.



 సోంపేట రైల్వే యార్డు వద్ద అపరిచిత వ్యక్తి మృతి.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జూలై 19: 

పలాస గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని సోంపేట రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో డౌన్ లైన్ ట్రాక్‌పై ఆదివారం ఓ అపరిచిత వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కిలోమీటర్ నంబర్ 643/32-34 వద్ద, పాయింట్ నంబర్-21 క్రాస్ ఓవర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గవర్నమెంట్ రైల్వే పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, సుమారు 35 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి నడుస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు.

మృతుడు ఆకుపచ్చ రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. టీ-షర్ట్ వెనుక భాగంలో "Sree Krishna Agencies, Rayagada" అని ముద్రించి ఉండగా, కుడిచేతిపై "KIYA & SONI" అనే ఇంగ్లీషు అక్షరాలతో టాటూ (పచ్చబొట్టు) ఉంది.

మృతుడి వద్ద ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలు ఏవీ లభించలేదని పోలీసులు తెలిపారు. టీ-షర్ట్‌పై ఉన్న రాయగడ సంస్థ వివరాలు, చేతిపై ఉన్న టాటూ ఆధారంగా మృతుడి గుర్తింపునకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ వ్యక్తికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు పలాస గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ దుంపల శ్రీనివాసరావును 92475 85743 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post