అధునాతన 'CCTV-360' సాంకేతికతతో 10 గంటల్లోనే మిస్సింగ్ బాలిక కేసు ఛేదన.


 అధునాతన 'CCTV-360' సాంకేతికతతో 10 గంటల్లోనే మిస్సింగ్ బాలిక కేసు ఛేదన.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి (మాకవరపాలెం), జూలై 18: మాకవరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బాలిక మిస్సింగ్ కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు అత్యంత వేగంగా స్పందించి, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేవలం 10 గంటల వ్యవధిలోనే బాలికను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. నర్సీపట్నం సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు.

ఈ ఆపరేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

​ప్రత్యేక బృందాల ఏర్పాటు: కేసు నమోదు కాగానే జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో గాలింపు చర్యల కోసం నాలుగు (4) ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

CCTV-360 అద్భుత పనితీరు - అలర్ట్ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలు, సెల్ ఫోన్ లొకేషన్ మరియు ఐటీ కోర్ టీమ్ సహాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 09:40 గంటలకు అన్నవరం లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రాంతంలో ఏర్పాటు చేసిన 'CCTV-360' వ్యవస్థ ద్వారా బాలిక కదలికలను గుర్తించి, సిస్టమ్ ఆటోమేటిక్ అలర్ట్ ఇచ్చింది. ఈ సాంకేతిక అలర్ట్ ఆధారంగా పోలీసులు తక్షణమే స్పందించి బాలికను సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

కౌన్సిలింగ్ మరియు సురక్షితంగా అప్పగింత బాలికను సురక్షితంగా తీసుకువచ్చిన అనంతరం నర్సీపట్నం డీఎస్పీ మరియు నర్సీపట్నం రూరల్ ఇన్‌స్పెక్టర్ గారు కలిసి బాలిక తల్లిదండ్రులతో పాటు, సదరు పాఠశాల వార్డెన్ మరియు ప్రధానోపాధ్యాయులకు సమగ్రంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి, బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

కీలక పాత్ర పోషించిన అధికారులు, సిబ్బంది

ఈ ఆపరేషన్‌లో నర్సీపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రేవతమ్మ, మాకవరపాలెం ఎస్సై దామోదర్ నాయుడు, హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణ, అప్పలరాజు, పోలీస్ కానిస్టేబుళ్లు నవీన్ కుమార్, బి.సి.నాయుడు, కొండబాబు మరియు ఐటీ కోర్ సిబ్బంది అంకితభావంతో పనిచేసి కీలక పాత్ర పోషించారు.

కేస్ స్టడీగా CCTV-360 యాప్ 

కనిపించకుండా పోయిన వ్యక్తులను వేగంగా గుర్తించడంలో 'CCTV-360' వ్యవస్థ ఎంతటి సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందో నిరూపించడానికి ఈ కేసు ఒక విజయవంతమైన ఉదాహరణగా పిలుస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.  

ఎస్పీ అభినందనలు తెలుపుతూ అధునాతన సాంకేతికతను జోడించి, అత్యంత వేగంగా స్పందించి బాలికను సురక్షితంగా కాపాడిన నర్సీపట్నం డీఎస్పీని, ప్రత్యేక బృందాల అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ప్రత్యేకంగా అభినందించి, వారి సేవలను ప్రశంసించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post