అర్ధవీడులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం!!
ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న "ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో భాగంగా, గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండల ఎంపీడీఓ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత , జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు , ఆర్‌డీఓ ఎం. వెంకట శివరామిరెడ్డి తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయంగా స్వీకరించారు.
ప్రజలు వినిపించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు స్థానిక అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

