కంభంకు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతిభావంతులకు సన్మాన కార్యక్రమం.
కంభం చెందిన అంబటిపూడి.జిషిత మరియు యల్ .కోట గ్రామమునకు చెందిన ఇల్లూరి. ఐశ్వర్య, ఇల్లూరి అఖిల్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు.ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
తెలంగాణ హైదరాబాద్‌లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సందర్భంగా శుక్రవారం మార్కాపురం జిల్లాకు చెందిన ప్రతిభావంతులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
2026 ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన భారీ సంగీత కార్యక్రమంలో 22 దేశాలకు చెందిన 2,000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొన్నారు. అందులో ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
ఎంపికైన ప్రతిభావంతులకు హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టిన్ దండింగి 29.05.2026న హైదరాబాద్ గచ్చిబౌలిలో స్వయంగా సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా కంభం పట్టణం, ఎస్.పి.జి పాలెంకు చెందిన అంబటిపూడి.బాబు,సుజాత దంపతుల కుమార్తె అంబటిపూడి.జిషిత మరియు
కంభం మండలం L.కోట గ్రామానికి చెందిన
ఇల్లూరి సురేష్ బాబు,మనోరమ దంపతుల కుమారుడు,కుమార్తె ఇల్లూరి.అఖిల్, ఇల్లూరి.ఐశ్వర్య లు పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అంబటిపూడి.జిషిత ప్రస్తుతం కంభం పట్టణంలోని ఆల్ఫా స్కూల్‌లో ప్రైవేట్ టీచర్‌గా విధులు నిర్వహిస్తూ బాబు మ్యూజిక్ ఇన్స్టిట్యూట్,కంభం లో సంగీతంలొ శిక్షణ తీసుకొని ఈ ఘనత సాధించారు.అలాగే L.కోట కు చెందిన ఇల్లూరి.అఖిల్ 5.వ తరగతి, ఇల్లూరి. ఐశ్వర్య 4.వ తరగతి చదువుతూ వీరు ఈ ఘనత సాధించారు.
బాబు మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ నుండి ముగ్గురు విద్యార్థులు ఈ ఘనత సాధించినందుకు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కర్ర.చంద్రబాబు మరియు సిబ్బంది అంబటిపూడి.జిషితను ప్రత్యేకంగా అభినందించారు. సంగీత రంగంలో ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం పట్ల కంభం మరియు L. కోట స్థానిక, పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
.jpg)
