బైక్ డీకొని వ్యక్తి మృతి.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జులై:30
మాడుగుల ఎస్సై నారాయణరావు వివరాలు ప్రకారం మాడుగుల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం సుమారు 05.30 గంటల ప్రాంతంలో మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారం గ్రామానికి చెందిన దాడి లక్ష్మీరావు , 49.సం అను అతను వాకింగ్ నిమిత్తం వడ్డాది వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఘాట్ రోడ్డు నుండి వడ్డాది వైపు బైక్ పై వెళ్తున్న వ్యక్తి బైక్ఫై స్పీడ్ గా అజాగ్రత్తగా వెళుతున్న వ్యక్తి మృతుడు లక్ష్మీరావుని వెనక నుండి బలంగా గుద్దడం వలన రోడ్ పైన పడి తలకి తీవ్ర రక్త గాయాలు అయ్యి అక్కడికి అక్కడే మరణించడం జరిగిందని.మృతుని భార్య అయిన మంగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై నారాయణరావు తెలిపారు

