కాశీబుగ్గలో ఫుట్‌పాత్‌పై వ్యక్తి మృతదేహం.


 కాశీబుగ్గలో ఫుట్‌పాత్‌పై వ్యక్తి మృతదేహం.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

మృతుడు కంచిలి మండలం బైరిపురానికి చెందిన సోమేశ్‌గా గుర్తింపు.

మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

కాశీబుగ్గ, జూలై 10: 

కాశీబుగ్గ పట్టణంలోని మూడురోడ్ల కూడలి వద్ద ఉన్న ఫుట్‌పాత్‌పై ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం ఉదయం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

పోలీసుల విచారణలో మృతుడు కంచిలి మండలం బైరిపురం గ్రామానికి చెందిన సోమేశ్ (40)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సోమేశ్ మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post