“మీ భూమి – మీ హక్కు”తో భూ సమస్యలకు పరిష్కారం.



 “మీ భూమి – మీ హక్కు”తో భూ సమస్యలకు పరిష్కారం.

నారాయణపురంలో భూ యజమానులకు పాస్ పుస్తకాల పంపిణీ.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.

మందస, ఆగస్టు 7: 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా మందస మండలం నారాయణపురం గ్రామంలో భూ యజమానులకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ భూ హక్కులకు సంబంధించిన పాస్ పుస్తకాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ప్రతి భూ యజమానికి తన భూమిపై చట్టబద్ధమైన హక్కు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భూ రికార్డుల్లో నెలకొన్న లోపాలను సరిదిద్ది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.

భూ రికార్డులు, హద్దులు, యాజమాన్య హక్కులకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

భూ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతాయని హామీ ఇస్తూ, “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భూ హక్కులను సక్రమంగా నమోదు చేసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post