కొమరోలులో హరిత ఆంధ్ర కార్యక్రమంలో ఘనంగా పాల్గొన్న సీఐ రామకోటయ్య.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా గిద్దలూరు రూరల్ సర్కిల్ పరిధిలోని కొమరోలు మండల కేంద్రంలో నిర్వహించిన హరిత ఆంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐ రామకోటయ్య , కొమరోలు ఎస్‌ఐ నాగరాజు , గ్రామ పెద్దలు, పాఠశాల విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, గ్రామస్తులు పచ్చదనం పెంపొందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. హరిత ఆంధ్ర కార్యక్రమం గ్రామంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది..

