వినూత్న విద్యానికేతన్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఆల్ ఇండియా పోలీస్ సహయోగ్[అఖిల భారత పోలీస్ సహకార సంస్థ]ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం లోని 'వినూత్న విద్యానికేతన్ స్కూల్' నందు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది."బాల్య వివాహాల నిర్మూలన - మాదక ద్రవ్యాల(డ్రగ్స్) నిర్మూలన - Good టచ్, Bad టచ్ - పిల్లలు మోటారు వాహనాల దుర్వినియోగం - Cell phone ల దుర్వినియోగం - క్రమశిక్షణ" అనే అంశాలను గురించి 'సర్కిల్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్,గిద్దలూరు శ్రీ సురేష్ కుమార్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులకు సుధీర్ఘాంగా వివరించి అవగాహన కలిగించారు. విద్యార్థులందరు తప్పక పాటిస్తమని,సమాజంలో ప్రజలకు కూడా తెలియజేస్తామని CI of Police సురేష్ కుమార్ గారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో AIPS మెంబెర్ M.రవి చంద్ర, స్కూల్ కరస్పాన్డెంట్ SA.ఖాజావలి, డైరెక్టర్స్ P. భూషణ్ రెడ్డి,Y.చంద్ర శేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు SM.రసూల్, కిషోర్, శ్రీదేవి, నాగేశ్వర్రావు, పోలీస్ కాన్స్టేబుల్ SK వాహబ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.CI of police శ్రీ సురేష్ కుమార్ గారికి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

