డెంగ్యూ వ్యాధి పై అవగాహన ర్యాలీ.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నెకునాంబాద్ ఆరోగ్య ఉపకేంద్రంలో డాక్టర్.శివ రెడ్డి ఆదేశాల మేరకు ఘనంగా డెంగ్యూ వారోత్సవాలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరితో ప్రతిజ్ఞ చేయించి డెంగ్యూ వ్యాధి యొక లక్షణాలు తెలియజేసి, జ్వర పీడిత బాధితులు ఎవరూ అయిన ఉంటే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చికిత్స చేయించుకోవాలి అని తెలియచేశారు.
పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట డాక్టర్ శివారెడ్డి, కంభం సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది అంగన్వాడి సిబ్బంది మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల విద్యార్థులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

