ఎండీఎంఎల్ యాప్ వినియోగంతో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది.




 ఎండీఎంఎల్ యాప్ వినియోగంతో ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుంది.

క్రైమ్ 9 మీడియా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జులై 15 :

పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మెప్మా విభాగం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీల నిర్వహణకు ఉపయోగపడే "ఎండీఎంఎల్ (Mana Dabbulu Mana Lekkalu - MDML) యాప్" వినియోగంపై సి.ఎల్.ఆర్.పీ, ఎస్.ఎల్.ఎఫ్. ఆర్.పీ, టీ.ఎల్.ఎఫ్. ఆర్.పీలకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం, సమీక్ష సమావేశం నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శైలజా మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా నమోదు చేయడంలో ఎండీఎంఎల్ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఆర్.పీ యాప్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ వివరాలను సకాలంలో నమోదు చేయాలని సూచించారు.

మున్సిపల్ కమిషనర్ ఈ. శ్రీనివాసులు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల విజయవంతమైన అమలులో డిజిటల్ విధానాలు కీలకమని పేర్కొన్నారు. ఎండీఎంఎల్ యాప్ ద్వారా ఆర్థిక నిర్వహణ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా టౌన్ టి.ఈ (ఐబీ) రాము, టి.ఈ (లైవ్‌లీహుడ్) కిశోర్, టి.ఈ (బీఎల్) శారధావాణి, డీపీఎంయూ డీఈఓ జ్ఞానేశ్వరరావు, సిటీ మిషన్ మేనేజర్ పి. మోహన్‌రావు, డీఈఓ విజయ్‌కుమార్‌లు యాప్ వినియోగ విధానం, డేటా నమోదు, ఆర్థిక లావాదేవీల నమోదు, నివేదికల తయారీ తదితర అంశాలపై శిక్షణ అందించారు.

అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో యాప్ అమలు పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులు చర్చించారు. ఎస్.ఎల్.ఎఫ్. ఆర్.పీలు, టీ.ఎల్.ఎఫ్. ఆర్.పీలు ప్రతిరోజూ యాప్‌లో వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పలాస–కాశీబుగ్గ పట్టణానికి చెందిన సి.ఎల్.ఆర్.పీలు, ఆర్.పీలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post