తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారి పడి యువకుడు మృతి.. మృతుడి గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తి.


 తిరుమల ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారి పడి యువకుడు మృతి.. మృతుడి గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తి.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

చీరాల, జూన్ 15:

 చీరాల రైల్వే స్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన విషాద ఘటనలో ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి సుమారు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల ఓ యువకుడు చీరాల రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ప్రమాదవశాత్తు జారి పడినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర రక్త గాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.

మృతుడి వద్ద ఎరుపు రంగు కాలేజీ బ్యాగ్ లభించగా, అందులో "కోడూరు టు పలాస" రైల్వే టికెట్ మాత్రమే లభించింది. ఇతర ఎటువంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.

మృతుడి ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు ఉండగా, ఎరుపు ఛాయ కలిగి ఉన్నాడు. నలుపు రంగు హాఫ్ హ్యాండ్ టీ-షర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు.

మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే చీరాల రైల్వే జీఆర్‌పీ ఎస్‌ఐని సంప్రదించాలని పోలీసులు కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9247575633.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post