ముఖ్యమంత్రి సహాయనిధి పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి,
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ పరిధిలోని తూర్పు నాయుడుపాలెంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన 68 మంది లబ్దిదారులకు 50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి విలేకరులతో మాట్లాడుతూ, పేదలు ఆర్యోగ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనకూడదని వారికి అండగా నిలబడటానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్దిక సహాయం అందిస్తున్నారన్నారు. ఇప్పటివరకు కొండెపి నియోజకవర్గంలో 1,425మంది లబ్దిదారులకు 11కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించడం జరిగిందన్నారు.
త్వరలో రాష్ట్రంలోని ప్రజలకు 25లక్షల రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.
సంజీవని లాంటి పథకంతో రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
పేద ప్రజల కోసం ఉచితంగా రూ.25 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం అందిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు.

