పేకాట స్థావరంపై అనకాపల్లి జిల్లా మునగపాక పోలీసుల దాడి, ముగ్గురు వ్యక్తుల అరెస్ట్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి.
జోనల్ ఇంచార్జి పి. మహేశ్వరరావు.
మునగపాక, జనవరి 26: అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా యలమంచిలి సీఐ ఎస్.ధనుంజయరావు పర్యవేక్షణలో మునగపాక పోలీసులు ఆదివారం నాడు దాడులు నిర్వహించారు.
మునగపాక మండలంలోని గణపర్తి గ్రామ శివారుల్లో కొంతమంది వ్యక్తులు బహిరంగ ప్రదేశంలో పేకాట ఆడుతున్నట్లు అందిన నమ్మదగిన సమాచారం మేరకు, మునగపాక ఎస్సై పి.ప్రసాదరావు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ముగ్గురు (3) వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నిందితుల వద్ద నుండి రూ.9,570/- నగదుతో పాటు పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై ప్రసాదరావు గారు మాట్లాడుతూ.. మండల పరిధిలో ఎవరైనా జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల పరిధిలో ఇలాంటి ఉదంతాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అరెస్టయిన వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
