గుజరాత్ హైకోర్టు తీర్పు కనుగుణంగా అంగన్వాడీల జీతాలు పెంచాలి - బి. సోమయ్య-ఏలూరు అధ్యక్షులు.ఐ.ఎఫ్.టి.యు.
అంగన్వాడీల జీతాలను పి.ఆర్.సి.కి లింకు చేయాలి.గుజరాత్ హైకోర్టు తీర్పు కనుగుణంగా అంగన్వాడీల జీతాలు పెంచాలి. ---- ఐ.ఎఫ్.టి.యు డిమాండ్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ.
ఏలూరు,డిసెంబర్,10:అంగన్వాడీల జీతాలను పిఆర్సికి లింకు చేయాలని, గుజరాత్ హైకోర్టు తీర్పుకు అనుగుణంగా అంగన్వాడీల జీతాలను పెంచాలని ఐ.ఎఫ్.టి.యు ఏలూరు నగర అధ్యక్షులు బి. సోమయ్య డిమాండ్ చేశారు. ఈనెల 12వ తేదీన అంగన్వాడీల జీతాల పెంపుదల కోసం 3 సంఘాలు(సిఐటియు,ఏఐటీయూసీ, ఐ.ఎఫ్.టి.యు)ల ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఐ. ఎఫ్ టి.యు ఏలూరు నగర ఆఫీస్ బేరర్స్ సమావేశం పవర్ పేట లోని ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షులు బి. సోమయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీల జీతాలు చాలా అధ్వానంగా ఉన్నాయని, పనిభారాలు, యాప్ల ఒత్తిడి అధికంగా ఉందని తెలిపారు. అయినా జీతాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. అంగన్వాడీల జీతాల పెంపుదల కోసం 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ధర్నాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు అరకొర జీతాలు పెంచి చేతులు దులుపుకుంటున్నాయని, అలా కాకుండా అంగన్వాడీల జీతాలను పిఆర్సికి లింకు చేయాలని కోరారు.పక్క రాష్ట్రం తెలంగాణలో పిఆర్సికి లింకు చేశారని, గుజరాత్ హైకోర్టు కూడా అంగన్వాడీల జీతాలను పిఆర్సికి లింక్ చేయాలని చెప్పిందని, మన రాష్ట్రంలోని మున్సిపల్ ఆప్కాసు వర్కర్లు అందరూ పిఆర్సి ఆధారంగా జీతాలు పెంచుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు మున్సిపల్ ఆప్కాస్ వర్కర్లు అంగన్వాడీలకంటే తక్కువ వేతనాలు పొందిన వారు, నేడు పి.ఆర్.సి కనుగుణంగా అంగన్వాడీలకంటే అధిక జీతాలు పొందుతున్నారని తెలిపారు. అలాగే అంగన్వాడీల జీతాలను కూడా పిఆర్సికి లింకు చేసి పెంచితేనే వారికి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ భవనిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయాలని, అన్ని వృత్తులకు చెందిన భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. ఐ ఎఫ్ టి యు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. భవనిర్మాణ కార్మికుల సెస్సు డబ్బులు వారికే ఖర్చు చేయాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు చేయాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో నగర ఆఫీస్ బేరర్స్ డి.వీరినాయుడు,నవుడు నెహ్రూబాబు,లింగమల్లు శ్రీనివాసరావు, ఎల్ సత్యనారాయణ, మంగం అప్పారావు, గంగరాజు, కె. విజయలక్ష్మి, లావేటి కృష్ణారావు, దేవరపల్లి రత్నబాబు,జి.వెంకటేశ్వరరావు@బాలు తదితరులు పాల్గొని మాట్లాడారు. సమావేశం వివరాలను ఐ.ఎఫ్ టి.యు నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు పత్రికలకు తెలిపారు.
