పేరూరు గ్రామంలో జరుగుతున్న అన్యాయాలపై తగు విచారణ జరిపించాలి.
ఏలూరు, డిసెంబర్ 23,క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ.
కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో బీసీ నియోజకవర్గానికి చెందిన పుట్ట శివ భాస్కర్ పై అగ్రవర్ణాలు అరాచకాలు అరికట్టాలని ఏలూరు ఎస్ పి ప్రతాప్ శివ కిషోర్ మరియు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి కు వినతిపత్రం అందజేశారు. కైకలూరు నియోజకవర్గం లోని ముదినేపల్లి మండలం పేరూరు గ్రామంలో బిసి సోదరుని యొక్క భూమిని లీజుకు ఇవ్వలేదని అక్కస్సు తో తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, స్థానిక ఎస్సై వీరభద్రరావు ఎలాంటి విచారణ జరపకుండా వెంటనే ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తూ, అగ్రవర్ణాల వారితో రాజీ కుదుర్చుకొ అని ఇబ్బంది పెడుతున్నారని పుట్టా శివ భాస్కరరావు తెలియజేశారు. తన పై రేప్ మరియు హత్యాయత్నం కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని కలెక్టర్ వెట్రి సెల్వి మరియు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కు వినతిపత్రం అందజేశారు. నాకు న్యాయం చేసి రక్షణ కల్పించి నా భూమిని నేను స్వచ్ఛందంగా చెరువులు చేసుకునే అవకాశం కల్పించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో బాధితులను తరపున మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలగ రవికుమార్ తమ పూర్తి మద్దతును తెలియజేసి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
