ఏలూరులో ఘనంగా జిల్లా స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు.



ఏలూరులో ఘనంగా జిల్లా స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు.

క్రీస్తు బోధనలు అందరికీ ఆచరణీయం.

సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.

 ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

 ఏలూరు, : ఏసుక్రీస్తు అందించిన శాంతి,ప్రేమ, దయ, ఐకమత్యం ప్రతీ ఒక్కరికీ ఆచరణీయమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వారీ నేతృత్వంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా హై టీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ తొలుత కేక్ కట్ చేసి క్రైస్తవులకు, చిన్నారులకు పంచి పెట్టారు. క్యాండిల్ వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. పలువురు చిన్నారులు శాంటాక్లాజ్వే షధారణలతో అలరించారు. తొలుత బిషప్ లు, ఫాస్టర్లు క్రీస్తు జన్మ విశిష్ఠత, బోధనలు, క్రిస్మస్ పండుగ గురించి తెలియజేసి,. గ్రంథము పఠనం చేశారు.ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. అధికారులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమన్నారు. 

           జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా క్రిస్టియన్ సోదరుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. క్రిస్మస్ పండుగతో ప్రతి ఇంటా శాంతి సౌభాగ్యాలు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు

       ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, జిల్లా సెట్ వేల్, ఇంచార్చి క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ సహాయ సంచాలకులు కె.యస్.ప్రభాకర రావు, జిల్లా వివిధ శాఖల అధికారులు, ఆర్ సి యం బిషప్ పొలిమేర జయరావు, ఐసియం బిషఫ్ యన్.జె. యస్.డి. రాజు, బెరాక బిషఫ్ డా.కారుపాటి శాంతి సాగర్, మన్నా బిషప్ యం.ఎలీషా రాజు, బీరపోగు యోహాను, యాండ్రి డామినిక్, రాజా అహ్మద్, వివిధ చర్చిల మత పెద్దలు, పాస్టర్లు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు. 
 

Post a Comment

Previous Post Next Post