ప్రముఖ సామాజికవేత. డా .విజయశ్రీ రొడ్డా ( బుజ్జమ్మ) కి ఘన సన్మానం.


ప్రముఖ సామాజికవేత. డా .విజయశ్రీ రొడ్డా ( బుజ్జమ్మ) కి ఘన సన్మానం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు/హైదరాబాద్.

తెలుగు రాష్ట్రాల్లో తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన ప్రముఖ సామాజికవేత్త డా.విజయశ్రీ రొడ్డా (బుజ్జమ్మ) కి ఘన సన్మానం జరిగింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో 'వెండితెర ఆణిముత్యాలు' శీర్షికన ఆమెను ఘనంగా సత్కరించారు. ప్రముఖ నిర్మాత మాదాల నాగూర్ సమక్షంలో జరిగిన ఈ గౌరవ సన్మాన మహోత్సవంలో డా.విజయశ్రీ ( బుజ్జమ్మ ) కి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్స్, ఆర్.కె కళా సంస్కృతి ఫౌండేషన్ వారు తన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. "ఈ అవార్డు నాపై బాధ్యతను మరింత పెంచింది. రెట్టింపు ఉత్సాహంతో మున్ముందు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతాను" అని డా.విజయశ్రీ రొడ్డా (బుజ్జమ్మ )ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు పాల్గొని ఆమెను అభినందించారు.
 

Post a Comment

Previous Post Next Post