మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత బడేటి బుజ్జి ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని ఏలూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు.


 మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత బడేటి బుజ్జి ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని ఏలూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఏలూరు, డిసెంబర్ 26.

 ప్రజల గుండెల్లో దివంగత బడేటి బుజ్జి స్థానం ఎప్పటికీ పదిలమేనని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, దివంగత బడేటి బుజ్జి ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. పలు సేవా కార్యక్రమాలు, దుస్తులు పంపిణీ వంటివి నిర్వహించారు. దీనిలో భాగంగా ఏలూరు పత్తెబాద లోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో తుమ్మలపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే, దివంగత బడేటి బుజ్జి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పేదల సంక్షేమం గురించి నిరంతరం కృషిచేసిన బడేటి బుజ్జి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది సేవా కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బెల్లపుకొండ కిషోర్, ఆర్నేపల్లి తిరుపతి, ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి అశోక్ కుమార్, కందుల రమేష్, బయ్యారపు కుటుంబరావు, షేక్ బాజీ, త్రిపర్ణ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post