గిద్దలూరు సబ్ జైల్ అకస్మిక తనిఖీ.




 గిద్దలూరు సబ్ జైల్  అకస్మిక తనిఖీ.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్ సబ్ జైలు ను ఆకస్మికంగా తనిఖీ చేశారు .

 జడ్జి ఏ. ఓంకార్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగాప్రవర్తించినప్పుడు మార్పు రావడం కోసం జైల్లో ఉంచుతారని, జైలులో, జైలు జీవితం అనుభవించిన తర్వాత మంచి పౌరులుగా మారి కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని హితవు పలికారు .

ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును త్రాగుడుకు, ఇతర వ్యసనాలకు ఖర్చు చేసి ఒంటిని, ఇంటిని గుల్ల చేసుకోవద్దన్నారు. 

మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. న్యాయవాదిని పెట్టుకోలేని ఖైదీలకు మండల న్యాయ సేవాధికారి సంస్థ తరఫున ఉచితాముగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.

ప్రతి ఒక్క ఖైదీని జడ్జివిచారించారు. జైలులో అందిస్తున్న సదుపాయాలను గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు.

 ఖైదీలకు అందిస్తున్నటువంటి బియ్యాన్ని, సరుకుల నాణ్యతను పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో సబ్ జైల్ సూపర్ండెంట్ యూ. లింగారెడ్డి, లీగల్ ఎయిడ్ న్యాయవాది ఎన్. అహల్య, పారా లీగల్ వాలంటర్ అద్దంకి. మధుసూధనరావు,కోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post