ఏలూరులో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 37 వ వర్థంతి సందర్భంగా ఘన నివాళి.




ఏలూరులో స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 37 వ వర్థంతి సందర్భంగా ఘన నివాళి.

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. శరత్.

ఏలూరు, డిసెంబర్ 26:- పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరుపేదల పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి 37 వ వర్థంతి వేడుకలను ఏలూరులో కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీ వద్ద ఉన్న రంగా గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజరై రంగా  విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ వంగవీటి రంగా  పేదల కోసం చేసిన సేవలు ప్రజల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం చిరస్మరణీయమని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్ని కులాలను సమానంగా సమాంతరంగా చూసే మానవతావాది పేదల హక్కుల కోసం పోరాడుతూ ఆ పోరు బాటలో ప్రాణాలు అర్పించిన మహోన్నత మహా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా  37 వ వర్థంతి సందర్భంగా  ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కూటమి నాయకులు అందరూ కలిసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఎన్ని తరాలైనా గాని రంగా  ఆశయాలు ప్రజల్లో జీవించే ఉంటాయన్నారు. ఇప్పుడున్న ఈ కొత్త జనరేషన్ రంగా  ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రంగా  బాటలోనే  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని అన్నారు. ఆయన తీసుకున్న ప్రతి శాఖకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నారని, అంత మంచి నాయకుడి అడుగు జాడల్లో తాను నడుస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తుది శ్వాస వరకు పేదల పక్షాన నిలబడి ఆఖరి రక్తపు బొట్టు వరకు పేదల అభ్యున్నతి ధ్యేయంగా జీవించిన మహా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా అని ఆయన పేర్కొన్నారు. రంగా  కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. మొగల్రాజపురంలో పేద ప్రజల ఇళ్ల పట్టాల విషయమై వెళ్తున్న రంగాను పోలీసులు అరెస్టు చేయడంతో నిరాహార దీక్ష చేశారని ఆ నిరాహార దీక్షలోనే ఆగంతకుల చేతిలో రంగ హత్య చేయబడ్డారని అన్నారు. వంగవీటి రంగా  స్ఫూర్తితో అనేకమంది రాజకీయాల్లో ఉన్నారని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 200 మంది వృద్ధులకు చీరలు, బిస్కెట్లు ,ఫ్రూట్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, జిల్లా రైతు అధ్యక్షులు నాగం శివ, కాపు బలిజ సంక్షేమ సేన ఏలూరు అసెంబ్లీ అధ్యక్షులు కంది రంగబాబు, కాపు బలిజ సంక్షేమ సేన నాయకులు యడ్లపల్లి ప్రసాద్, జల్లా హరికృష్ణ, దాసు మహేష్, బోండా రాము నాయుడు, కొప్పి శెట్టి వేణుగోపాల్, గాదె రాంబాబు, పాలేటి బాబి, ఫణి రాజ్, తాడికొండ శ్రీనివాస్, గూడూరి హేమ దుర్గా ప్రసాద్,పోలూరు హరినాథ్, సుధా బత్తుల హరీష్, చింతలపూడి సతీష్, మధ్యాహ్నపు శివ శంకర్, జనసేన ఏలూరు నగర అధ్యక్షులు వీరంకి పండు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, స్థానిక 20 డివిజన్ జనసేన నాయకులు, భారీ కాపు బలిజ సంక్షేమ సేన సంఘ నాయకులు, రంగా  అభిమానులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post