అనకాపల్లి ​జిల్లా పోలీసు సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ తుహిన్ సిన్హా.



 అనకాపల్లి ​జిల్లా పోలీసు సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి మహేశ్వరరావు.

​    అనకాపల్లి, డిసెంబర్ 24: లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని, జిల్లా పోలీసు కార్యాలయంలో మినిస్టీరియల్ సిబ్బంది ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ముఖ్య అతిథిగా పాల్గొని, కేక్ కట్ చేసి జిల్లా పోలీసు సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ..క్రిస్మస్ పండుగ శాంతి, సంతోషం, త్యాగం మరియు కరుణకు ప్రతీక అని పేర్కొన్నారు.

సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, అపారమైన సహనం మరియు క్షమాగుణం వంటి విలువలను క్రీస్తు మానవాళికి అందించారని, వాటిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

జిల్లా పోలీసు కుటుంబాలన్నీ ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్, ఆర్.ఐ మన్మధరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, మరియు కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post