పరవాడ JNPCలో జోనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
పారిశ్రామిక ప్రమాదాల నివారణకు, త్వరితగతిన స్పందించేందుకు వినూత్న వ్యవస్థ పోలీసు పెట్రోలింగ్ నిర్వహణ కోసం MASRM వారిచే బొలెరో వాహనం అందజేత.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి (పరవాడ)డిసెంబర్:12 అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ శుక్రవారం పరవాడ JNPCలోని MASRM భవనంలో అత్యాధునిక జోనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. ఫార్మా కంపెనీలలో ప్రమాదాలను సమన్వయంతో నివారించడానికి, అత్యవసర సమయాల్లో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ వినూత్న వ్యవస్థను ఏర్పాటు చేశారు.
వ్యవస్థ పనితీరు - మాక్ డ్రిల్: ఈ కేంద్రం ద్వారా ఫైర్ బ్రిగేడ్, అంబులెన్సులు, క్రేన్స్, మరియు పోలీస్ బందోబస్తు వాహనాలు వంటి అత్యవసర సేవలు రియల్ టైమ్ పర్యవేక్షణలో ఉంటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన గ్యాస్ లీకేజీ మాక్ డ్రిల్ విజయవంతమైంది. సమాచార పంపిణీ, ఇన్సిడెంట్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు, ఫైర్ బ్రిగేడ్ రాక, గ్యాస్ న్యూట్రలైజేషన్, క్షతగాత్రుల తరలింపు మరియు ఉద్యోగుల ఎవాక్యుయేషన్ వంటి అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఎస్పీ కీలక సూచనలు:
ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. పరిశ్రమల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమలు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తే, ఫ్యాక్టరీస్ మరియు పోలీస్ శాఖల ద్వారా నిజమైన సమాచారం ప్రజలకు చేరి, అనవసర భయాందోళనలు (Panic) కలగకుండా చూడవచ్చని తెలిపారు.
JNPCలో పనిచేస్తున్న మైగ్రెంట్ లేబర్ వివరాలను పరిశ్రమలు సక్రమంగా నమోదు చేసుకోవాలని, అవసరమైతే పోలీస్ సహాయంతో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేపట్టాలని ఆదేశించారు.
ఇండస్ట్రీ ప్రతినిధులు కోరిన ట్రాఫిక్, పెట్రోలింగ్ సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పోలీసులకు పెట్రోలింగ్ వాహనం అందజేత:
శాంతి భద్రల పరిరక్షణలో భాగంగా, జిల్లా పోలీసులకు పెట్రోలింగ్ విధులు నిర్వహించేందుకు MASRM (Mutually Aided Society for Risk Mitigation) వారు వితరణగా ఒక బొలెరో వాహనాన్ని అందజేశారు. ఈ వాహనాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. పోలీసుల పనితీరుకు సహకారం అందించినందుకు MASRM ప్రతినిధులను ఎస్పీ అభినందించారు.
పర్యవేక్షణ మరియు పాల్గొన్నవారు:
ఎస్పీ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ జోనల్ కమాండ్ సెంటర్, పరవాడ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో అమలు చేయబడింది. క్లిష్ట సమయాల్లో ఈ వ్యవస్థ పనితీరును డీఎస్పీ వివరించారు. పరవాడ సీఐ ఆర్.మల్లికార్జున రావు మాక్ డ్రిల్ మరియు ఇతర ఏర్పాట్లను సమన్వయం చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్ రెడ్డి, బాయిలర్ ఇన్‌స్పెక్టర్ వీరభద్ర రావు, JNPCMA వైస్ ప్రెసిడెంట్ ఎన్.సూర్యప్రకాశ్ రావు, సెక్రటరీ జెట్టి సుబ్బారావు, విశాఖ ఫార్మా సిటీ ఎండీ డా. పి.పి.లాల్‌కృష్ణ, అచ్యుతాపురం సీఐ చంద్రశేఖర్, రాంబిల్లి సీఐ నర్సింగరావు, మరియు MASRM ప్రతినిధి మునిరత్నం పాల్గొన్నారు.

