విద్యుత్ ఆదాపై పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలి.


 విద్యుత్ ఆదాపై పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలి.

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు వాల్ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

                ఏలూరు, డిసెంబర్, 12 : విద్యుత్ అదా చేసే విధానంపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల వాల్ పోస్టర్, కరపత్రాలను ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యుత్ ఆదా చేయడం విద్యుత్ ను ఉత్పత్తి చేయడమేనని, సాంప్రదాయ ఇంధన వనరుల వినియోగం, పొదుపు పై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు పెద్దఎత్తున నిర్వహించాలని, స్టార్ రేటెడ్ ఉన్న ఎల్.ఈ.డి., బల్బులు, నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం, విద్యుత్ పొదుపు చేయడంపై ప్రజలకు అవగాహన సమావేశాలు, ర్యాలీ లు నిర్వహించాలన్నారు.  

        కార్యక్రమంలో విద్యుత్ పర్యవేక్షక ఇంజనీర్ పి. సాల్మన్ రాజ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్), కె. ఎం. అంబేద్కర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్), టి. శశిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post