ఏలూరు దక్షిణపు వీధి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్.




 ఏలూరు దక్షిణపు వీధి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా  రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి  కందుల దుర్గేష్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

    ఏలూరు డిసెంబర్ 16:- ఏలూరు పర్యటనలో భాగంగా ఈరోజు దక్షిణపు వీధిలో అత్యంత వైభవంగా జరుగుతున్న దక్షిణపు వీధి త్రిదేవి పీఠం శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు స్వామి వార్ల జాతర మహోత్సవానికి సంబర కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు  కందుల దుర్గేష్  అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఏలూరు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతర మహోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాలను సందర్శించడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.. రాష్ట్ర ప్రజలపై అమ్మవార్ల కృప ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి–సంక్షేమ పథంలో మరింత ముందుకు సాగాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.. ఈ కార్యక్రమంలో మంత్రి గారి వెంట ఏలూరు శాసనసభ్యులు  బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ  రెడ్డి అప్పల నాయుడు గారు, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్ది బోయిన శివ ప్రసాద్, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post