ఏలూరులో పురావస్తు శాఖ ప్రదర్శన శాల ప్రారంభం.
ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
డిసెంబర్ 16:- ఏలూరు రామకోటి వద్ద ఉన్న ఆర్కియోలాజికల్ (పురావస్తు శాఖ) మ్యూజియం ఘనంగా ప్రారంభమైంది.. ఈ మ్యూజియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు.. అనంతరం మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా ఆర్కియాలజికల్ మ్యూజియం ను ప్రారంభించారు.. పురావస్తు అవశేషాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా కేంద్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.5.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జిల్లా పురావస్తు మ్యూజియం ను ప్రారంభించడం జరిగిందన్నారు.. ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ రూమ్, శిల్పకళ గ్యాలరీలు, ప్రాచీన ఆయుధాలు, నాణేలు, తామ్రశాసనాలు, తాళపత్ర గ్రంథాలు, కాంస్య శిల్పాలు తదితర అరుదైన పురావస్తు సంపదను పరిశీలించారు.. భారతీయ జీవన విధానం, ఆలోచనా ధోరణిని ప్రతిబింబించే హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలకు చెందిన శిల్పాలు, అలాగే రుద్రమకోట తవ్వకాలలో లభించిన అరుదైన అవశేషాలు భావితరాలకు చరిత్రను తెలియజేసే గొప్ప వారసత్వంగా నిలుస్తాయని అన్నారు.. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారితో చర్చించి, ఏలూరుకు సంగీత–నృత్య కళాశాల మంజూరుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలిపారు.. అలాగే పురావస్తు మ్యూజియం మరింత విస్తరణకు మూడో అంతస్తు నిర్మాణానికి ప్రభుత్వ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతూ, ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా నిరంతరం కృషి చేస్తోందన్నారు.. ప్రతి ఒక్కరూ ఈ మ్యూజియాన్ని సందర్శించి, హేలాపురిగా పేరొందిన ఏలూరు చరిత్రను తెలుసుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాద్, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ , జనసేన నాయకులు నారా శేషు, జనసేన సీనియర్ నాయకులు శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, రాఘవయ్య చౌదరి, నగర అధ్యక్షులు వీరంకి అంజిత్ కుమార్ (పండు), జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు.

