విద్యార్థిని ప్రతిభ చూసి సీఎం చంద్రబాబు నాయుడు సైతం ప్రశంసలు జల్లు.
మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో అదరగొట్టిన గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల విద్యార్థిని రమ్య ఆంధ్ర హోమ్ మంత్రి పాత్రలో మెరిపింంచిన ప్రతిభ.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో గిద్దలూరు జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కు చెందిన విద్యార్థిని రమ్య అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీలో విద్యార్థులు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లా వ్యవహరిస్తూ, దేశ పరిపాలనా విధానాలు, ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో హోమ్ మంత్రిత్వశాఖ పాత్రలో పాల్గొన్న రమ్య, సభలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్పష్టంగా, ధైర్యంగా, కారణాలతో వివరించింది. ఆమె మాట్లాడిన తీరు, సమాధానాల్లోని ఆత్మవిశ్వాసం సభలో ఉన్నవారందరినీ ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభను గమనించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రమ్యను ప్రశంసించారు.దేశ పరిపాలనపై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి ఎంతో ఆనందకరం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తాం అని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు బాలికల పాఠశాల విద్యార్థిని రమ్య చూపిన ప్రతిభ రాష్ట్రవ్యాప్తంగా శుభాభినందనలు అందుకుంటోంది.
.jpg)