గిద్దలూరు నియోజకవర్గంలో కంభం చెరువు అలుగును పరిశీలించిన కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
వరద బాధితులను రైతులను ఆదుకుంటాం.
ప్రకాశం జిల్లా కంభం. మొంథా తుఫాన్ బాధిత రైతులకు నష్టపరిహార చర్యలు చేపట్టినట్లు జిల్లాకలెక్టర్ పి.రాజబాబు అన్నారు .శనివారం కంభం చెరువు కట్ట అలుగు వద్ద కు వచ్చిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంభం చెరువు ఆసియా ఖండం లోనే అతిపెద్ద చెరువుల్లో రెండవదని పేర్కొన్నారు. చెరువు కు నీళ్లు వస్తుంటాయి అలుగు పారు తుంటాయి కానీ ఇంతటి విపత్తు ప్రభావం జరగటం దురదృష్టకరమని అన్నారు. పంటనష్టం పరిహారం ప్రతిరైతుకు అందేలా ప్రణాళిక చేపడుతున్నట్లు చెప్పారు.గత వారం ప్రకాశం జిల్లాలో వరద ప్రభావం ను సమర్ధవంతంగాఎదుర్కొన్నామన్నారు. జిల్లాలో ఉన్న ఐదు ప్రధానరిజర్వర్వర్లో గుండ్లకమ్మ ఒకటి ..కంభం నుంచి వెళ్లి న నీళ్లు గుండ్ల కమ్మ రిజర్వర్వు లో కలుస్తుంది.
పంట నష్టం పై ప్రతిరైతుకు ఇబ్బంది జరగ కుండా చేస్తామన్నారు.
గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సలహాల మేరకు నియోజక వర్గంలో సర్వే జరుగుతుంది. మార్కాపురం జిల్లా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. చరిత్ర కల్గిన కంభం చెరువుకు పర్యాటక కేంద్రం గా చేసేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిపాదన పంపించారనిపేర్కొన్నారు.వైశాల్యం ప్రకారం కంభం చెరువు విశాలమైనది భవిషత్ లో చెరువు నీటినిల్వకు ప్రణాళికజరుగుతుందన్నారు. ఇంతటి నీళ్లు వచ్చినప్పుడు జరిగే పరిణామాలు గురించి ఇంజినీర్ల సూచనలు పై ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు .గిద్దలూరు శాసనసభ్యులుముత్తుముల.
అశోక్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తుఫాన్ ప్రభావం తో నష్టపోయిన వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారని అన్నారు. కోతలకు గురిఅయిన పొలాలు ,రోడ్లు ,వంతెనలు యుద్ధ ప్రాతిపతికాన చర్య లు చేపట్టి పనులు జరిగేలా చేస్తామని తెలిపారు. కలెక్టర్ వెంట మార్కాపురం ఇంచార్జి కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎస్ఈ ,వివిధ శాఖా ల అధికారులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి కలెక్టర్ కలిసి వెలగలపాయ బొమ్ములింగం రోడ్డు మార్గాన్ని. ప్రజలకు ఏర్పాటు చేయాలని కోరారు.
వెలగలపాయ ,బొమ్మిలింగం ,మాగుటూరు గ్రామ ప్రజలు సమీప పట్టణం కంభం కు రావాలంటే గత పదిరోజులనుండి తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు రోడ్ లపై ఐదు అడుగులమేర నీరు కాకర్ల డ్యామ్ సమీపంలోని సుమారు మూడు కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచి రాకపోకలకు అంతరాయం జరిగిందని గిద్దలూరు వైసీపీ ఇంచార్జి ,మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి జిల్లా కలెక్టర్ పి .రాజబాబుకు. గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి లకు ప్రజా సమశ్య లపై వివరించారు. రోగాల బారినపడినవారు వైద్యం కోసం కంభం కు రావాలంటే రాలేని పరిస్థితిని అయన వివరించారు. త్వరగా చర్యలు చేపట్టి ఈ ప్రాంత ప్రజలకు రోడ్ మార్గం ఏర్పాటు చేయాలనీ కోరారు. స్పందించిన కలెక్టర్ చర్యలు చేపట్టి రోడ్ మార్గం ఏర్పాటు చేస్తామన్నారు .

