ఏలూరులో పండుగ వాతావరణం లో ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం.
స్వయంగా లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళి పింఛన్ మొత్తాలను అందజేసిన ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, నవంబర్ 01:- ప్రజల చెంతకే పాలన అనే సమున్నత లక్ష్యానికి మరింత ప్రాధాన్యత చేకూర్చేందుకు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. అందులో భాగంగానే నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తూ, ప్రజల్లో భరోసా కల్పిస్తూ వస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం పండుగ వాతావరణంలో కొనసాగింది. స్థానిక 46వ డివిజన్ పెన్షన్ లైన్ ఆర్చి వద్ద నుండి నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో అర్హులైన లబ్దిదారుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళిన ఎమ్మెల్యే చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులతో కలిసి పెన్షన్ సొమ్ములను లబ్దిదారులకు అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించగా,,, వారికి భరోసా కల్పించిన ఆయన,,, అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వృద్ధులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన ఎమ్మెల్యే చంటి,,, వారిని "అవ్వా సంతోషంగా ఉన్నావా" అంటూ పేరుపేరునా ప్రత్యేకంగా పలకరించారు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ మరింత సమర్థవంతమైన పాలన అందించే లక్ష్యంతోనే పెన్షన్ల పంపిణీ సమయంలో ఒక్కోనెల ఒక్కో డివిజన్‌లో పర్యటిస్తూ వస్తున్నామని చెప్పారు. దీనిద్వారా ప్రజల చెంతకు స్వయంగా వెళ్ళడంతో పాటూ సమస్యలపై స్వీయ అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తుందని అన్నారు. ఇదేసమయంలో వైసిపి నాయకుల తీరు పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా జరుగుతోన్న కూటమి ప్రభుత్వ పాలనపై బురదజల్లి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు వైసిపి నేతలు వక్రబుద్దితో సిద్ధంగా ఉన్నారంటూ మండిపడిన ఆయన,,, ప్రజలు ఇటువంటి వారిపట్ల జాగురుకతతో వ్యవహరించాలంటూ హితవు పలికారు. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఐదేళ్ళ వైసిపి ప్రభుత్వ విధ్వంసకర పాలన నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం పాటు పడుతున్నారని ఏలూరులోను మా ఫ్రెండ్లీ ఎమ్మెల్యే బడేటి చంటి గారు కూడా వారి బాటలోనే నిత్యం ప్రయాణం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరపాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాలల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు,ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు,కమిషనర్ ఎ. భానుప్రతాప్, జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, అగ్గాల శ్రీనివాస్ తదితర నాయకులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

