ఏలూరు ఎస్సీ ఎస్టీ బహుజన రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కార్యాలయం లో మహాత్మ జ్యోతిబాపూలే 136వ వర్ధంతి కార్యక్రమం.

ఏలూరు ఎస్సీ ఎస్టీ బహుజన రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కార్యాలయం లో మహాత్మ జ్యోతిబాపూలే 136వ వర్ధంతి కార్యక్రమం.

ఏలూరు. క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

      నవంబర్ 28. ఏలూరు ఎస్సీ ఎస్టీ బహుజన రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కార్యాలయం లో అశోక్ కుమార్ అధ్యక్షత న బలహీనవర్గాల ఆశాజ్యోతి బహుజన నాయకులు మహాత్మ జ్యోతిబాపూలే 1 36వ వర్ధంతి కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమానికి మానవతా స్వచ్ఛంద సేవసంస్థ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు పాల్గొని జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అజయ్ బాబు మాట్లాడుతూ" చదువు లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేకపోతే మనిషి గమ్యం లేదు, మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే విద్య ఒకటే అని మహాత్మ జ్యోతిబాపూలే విద్య వైపు అడుగులు వేశారు. మహిళల కొరకు పాఠశాల స్థాపించడం, వితంతులకు పునర్వాహం చేయడం, మానవ శ్రేయస్సు , సమానత్వం అణగారిన వర్గాల వారి అభివృద్ధి కొరకు సత్యశోధన సమాజాన్ని స్థాపించి కృషిచేసిన గొప్ప సంఘసంస్కర. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, మహిళ విద్యాభివృద్ధికి తోడ్పడిన గొప్ప మార్గదర్శకులు, స్ఫూర్తి ప్రదాత, సామాజిక ఉద్యమ సమానత్వం కొరకు అణగారిన కొరకు పోరాడి కృషి చేసిన దార్శనికుడు. ఈయన ఆలోచన విధానాన్ని భావజాలాన్ని తెలుసుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురువుగా భావించారు. ఈయన ఆశయ సాధన కొరకు మనందరం కృషి చేద్దామని అన్నారు.  ఈకార్యక్రమంలోమాధవరావు,జ్యోతి లక్ష్మి కుమారి, ఝాన్సీ, సురేష్, రెడ్డి బాబు, రాజు, అధిక సంఖ్యలో విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

 

Post a Comment

Previous Post Next Post