ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనాడు ఆధ్వర్యంలో ప్రతిభ పాటవ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలలో భాగంగా చిత్రలేఖనంలో కంభం పట్టణానికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ మరియు పలు అవార్డులు పొందిన పఠాన్ ఖాసిం కూతురు పఠాన్ రుబియా ప్రథమ స్థానంలో బహుమతిని సాధించింది.
అదేవిధంగా ఇందులో భాగంగా రెండవ బహుమతి గర్రె దీపిక మూడవ బహుమతి సి.ఉషా సాహితీ సాధించారు.
విద్యార్థినులకు ఈ అవార్డులను బుధవారం అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయినులు మరియు పలువురు స్థానిక ప్రజలు, ప్రముఖులు పఠాన్ రుబియాను అభినందించారు.
గెలుపొయిందిన విద్యార్థినులకు బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అమూల్య చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం.. కేశవ, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమోహన్, కోటిరెడ్డి, పీడీ జయమ్మ, సుబ్బలక్ష్మి, శివనాగ మోహిని మరియు ఎస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు.
