అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి షూటింగ్ కాంపిటేషన్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి షూటింగ్ కాంపిటీషన్స్ టోర్నమెంట్ మరియు సెలక్షన్స్)7,8, మరియు 9 నవంబర్ 2025 తేదీన నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒంగోలు నందు జరుగుతాయి రాష్ట్రస్థాయి షూటింగ్ టోర్నమెంట్ మరియు సెలక్షన్స్ నిర్వహణ నిమిత్తం ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పి రాజా బాబు ను ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి.ఏ. కిరణ్ కుమార్. మరియు స్కూల్ గేమ్స్ సెక్రటరీస్ డాక్టర్ చక్కా వెంకటేశ్వర్లు మరియు ఏ శిరీష కుమారి జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబును కలవడం జరిగింది
రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ సంబంధించి రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుంచి దాదాపు 700 మంది క్రీడాకారులు మరియు కోచ్ మేనేజర్స్ టోర్నమెంట్ ప్రముఖులు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అబ్జర్వర్ హాజరవుతారని కలెక్టర్ కు జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశారు.
ఈ టోర్నమెంట్ కు హాజరయ్యే క్రీడాకారులకు అకామిడేషన్, భోజన వసతి మరియు ట్రాన్స్పోర్ట్ టోర్నమెంట్ వెన్యూస్ అన్ని విషయాలను సిద్దపరిచామని గౌరవ కలెక్టర్ కు జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేయడం జరిగింది ఈ టోర్నమెంట్ను విజయవంతం చెయ్యాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారికి ఆదేశించారు.
రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి షూటింగ్ టోర్నమెంట్ ప్రకాశం జిల్లా నిర్వహిస్తున్న విషయాన్ని కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ కి ఎం సెక్రటరీస్ డాక్టర్ చెక్క వెంకటేశ్వర్లు మరియు ఏ శిరీష కుమారి డిఈఓ కలవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా మరియు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులు మరియు మంత్రివర్యులు పాల్గొంటారని గౌరవ కలెక్టర్ కు తెలియచేశారు.
