నవంబర్ 16న శ్రీ కోట సత్యమాంబా దేవి ఆలయంలో కోటి దీపోత్సవం.
బెస్తవారి పేట క్రైమ్ 9 మీడియా రిపోర్టరు నాగయ్య.
ప్రకాశం జిల్లా కంభం పట్టణ సమీపం లో వెలసిన శ్రీ కోట సత్యమాంబా దేవి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం శుభ సందర్భంగా ఈనెల 16వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కోటా సత్యమాంబా దేవి ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ కోటా సత్య మణికంఠేశ్వర స్వామి సన్నిధానం నందు కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు
. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరినారు.కార్యక్రమంలో పాల్గొను భక్తులకు పూజా సామాగ్రి ఆలయం వారే సమకూర్చేదరని తదుపరి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగును. ఆలయ ధర్మకర్త రమణ స్వామి తెలియజేశారు.
