స్వమాక్స్ చే రక్తదాన శిభిరం.


 స్వమాక్స్ చే రక్తదాన శిభిరం.

 తిరుపతి జిల్లా 

 చంద్రగిరి స్వర్ణముఖి మహిళ పరస్పర సహకార సంఘం లి"(స్వమాక్స్ ) వారిచే స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమము తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల వారిచే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ప్రసూతి వైద్యశాల వైద్యులు డా। T.V ప్రసన్న టాగూర్ గారు, డా.శ్రీకర్ రాజు మరియు వారి బ్లడ్ బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రక్తదాన శిభిరములో సుమారు 20 మంది యువకులు రక్త దానం చేసి వారి ఔన్నత్యం చాటినారు.

ఈ కార్యక్రమములో డా|| ప్రసన్న టాగూర్ గారు మాట్లాడుతూ ఇలాంటి రక్తదాన శిభిరాలు యువత పాల్గొని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు, గర్భవతులకు ఉపయోగపడాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వమాక్స్ సి.ఇ.ఓ శ్రీ 

S. విశ్వనాథ్ గారు మాట్లాడుతూ రక్తదాన శిభిరం సమాచారం తెలిపిన వెంటనే ఇంత మంది యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్త దానాన్ని అందించడం చాలా సంతోషమని తెలిపారు.

ఈ కార్యక్రమములో స్వమాక్స్ సిబ్బంది P. సుబ్రమణ్యం, M. రవి, విజయ్ S. రామనాధ రెడ్డి, K. కౌసల్య, P. ఉమ, M.యశోద, & డిల్లీ రాజు ప్రశాంత్, నిరంజన్, శివ, నరేష్, యుగందర్ తదితరులు  పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post